https://www.teluguglobal.com/h-upload/2023/01/07/500x300_434256-vodafone-idea.webp
2023-01-07 10:21:27.0
ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకునేవాళ్లు ఒకేసారి ఏడాది మొత్తానికీ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయడంతో పాటు ఎక్కువ డేటా, ఇతర బెనిఫిట్స్ పొందొచ్చు. ఏడాది ప్లాన్స్ తీసుకునేవాళ్ల కోసం టెలికాం కంపెనీలు రకరకాల లాంగ్‌టర్మ్ ప్లాన్లు అందిస్తున్నాయి.
ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకునేవాళ్లు ఒకేసారి ఏడాది మొత్తానికీ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయడంతో పాటు ఎక్కువ డేటా, ఇతర బెనిఫిట్స్ పొందొచ్చు. ఏడాది ప్లాన్స్ తీసుకునేవాళ్ల కోసం టెలికాం కంపెనీలు రకరకాల లాంగ్‌టర్మ్ ప్లాన్లు అందిస్తున్నాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, డేటా, ఓటీటీ యాడ్ ఆన్స్ సైతం ఇస్తున్నాయి. ఏయే కంపెనీలు ఎలాంటి యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయో ఓసారి చూద్దాం.
జియో
జియో యాన్యువల్ ప్లాన్స్ రూ.2545 నుంచి మొదలవుతాయి. రూ. 2545 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ ఉచితంగా లభిస్తాయి.
రూ. 2879 ప్లాన్‌తో 365 రోజలు వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్ వంటివి ఫ్రీగా పొందొచ్చు.
ఇక రూ.2999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.1799 తో మొదలవుతాయి. రూ.1799 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 24 జీబీ డేటా, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.
రూ.2999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, ఉచిత వింక్ మ్యూజిక్, హలోట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
రూ.3359 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్‌కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, ఉచిత వింక్ మ్యూజిక్, హలోట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా యాన్యువల్ ప్లాన్స్ రూ.2899తో మొదలవుతాయి. రూ. 2899 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, ఉచిత వీఐ సినిమాలు, టీవీ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
రూ.3099 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ , రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, ఉచిత వీఐ సినిమాలు, టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
Airtel,Jio,Vodafone Idea
Airtel, Jio, Vodafone Idea, vi monthly prepaid plans vs annual prepaid plans, Airtel, jio, vi prepaid plans with 2GB daily data, annual prepaid plans are more beneficial than monthly prepaid plans
https://www.teluguglobal.com//business/airtel-jio-daily-data-monthly-vs-annual-prepaid-plans-which-is-better-554626