మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న నాయకుడు

2025-01-13 05:25:44.0

మహబూబ్‌ నగర్‌ అభివృద్ధి కోసం కృషి చేశారు : కేటీఆర్‌

మందా జగన్నాథం ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ మేలు కోరుకున్న నాయకుడని.. మహబూబ్‌ నగర్‌ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొనియాడారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి నగర్‌ కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథం నిమ్స్‌ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం చంపాపేటలోని ఆయన నివాసంలో మందా జగన్నాథం పార్థివ దేహానికి కేటీఆర్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మరణంతో తెలంగాణ సీనియర్‌ రాజకీయవేత్తను కోల్పోయిందన్నారు. నాలుగు సార్లు ఎంపీగా చిరస్మరణీయ సేవలు అందించారని తెలిపారు.

Manda Jagannadham,Nagar Kurnool Former MP,KTR Tributes