http://www.teluguglobal.com/wp-content/uploads/2015/05/bitter-gourd.jpg
2015-05-18 23:19:19.0
కాకరకాయ పేరు వినగానే మనకు చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ, కాకర ఆకు రసం, కాకర కాయ రసం ఇలా కాకరకాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔషధగుణాలున్నాయి. కాకరకాయ రసంలో హైపోగ్లసమిన్ పదార్ధం ఇన్సులిన్ స్థాయిలలో తేడాలు రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలో రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించే చారంటిన్ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్ధం ఉంటుంది. – కాకరలో ఫాస్పరస్ హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది. – కాకరను తరచూ తినడం వల్ల రక్త […]
కాకరకాయ పేరు వినగానే మనకు చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ, కాకర ఆకు రసం, కాకర కాయ రసం ఇలా కాకరకాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔషధగుణాలున్నాయి. కాకరకాయ రసంలో హైపోగ్లసమిన్ పదార్ధం ఇన్సులిన్ స్థాయిలలో తేడాలు రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలో రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించే చారంటిన్ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్ధం ఉంటుంది.
– కాకరలో ఫాస్పరస్ హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది.
– కాకరను తరచూ తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
– కాకర ఆకు రసాన్ని గాయలపై రాస్తే పుండ్లు త్వరగా తగ్గుతాయి.
– చర్మవ్యాధులకు, క్రిమి రోగాలకూ కాకర రసం బాగా పని చేస్తుంది.
– కాకరలో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
– శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.
– కాకరలోని మొమొకార్డిసిన్ యాంటీ వైరస్‌గా పనిచేస్తుంది.
– కాకరలో థయామిన్, రెబోఫ్లావిన్, విటమిన్ బి6, పాంథోనిక్ యాసిడ్, ఇనుము, ఫాస్పరస్‌లు పుష్కలంగా లభిస్తాయి.
– కాకరలో సోడియం, కొలస్ర్టాల్ శాతం తక్కువగా ఉంటాయి.
– కనీసం 15 రోజులకొకమారైనా స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Bitter gourd
https://www.teluguglobal.com//2015/05/19/bitter-guard-helps-in-controlling-diabetes/