మధురం మధురం ఈ క్షణం

2023-07-22 19:24:10.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/22/798866-madhuram.webp

అప్పుడప్పుడు

నా ఓపిక నశిస్తుంది

నా నమ్మకం

సన్నగిల్లుతుంది

నేను నీరసపడిపోతుంటాను

ఒంటరివాడిగా

అనిపిస్తుంటుంది

ఎందుకో

ఆలోచలు స్తంభిస్తాయి

ఆ క్షణాల్లో

ఏదో అసంతృప్తి ఆవహించి

మనసు ద్రవించి ,

కన్నీటి ధారలై ప్రవహిస్తుంది

ఏడుస్తూ పుట్టాను

ఏడిపించి వెళ్తాను

ఈ రెండిటి మధ్యన

ఏడుపెందుకు

అనుకుంటూ

జీవితంలో

నవ్వులనజరానాలు

పంచుకుంటూ

గతంలోని

మధుర క్షణాలను మాత్రమే

గుర్తు చేసుకుంటూ ,

నవ్వుతూ నవ్విస్తూ

ప్రశాంతంగా బ్రతికేయ్య్యాలనే

పిలుపు వినిపిస్తుంది

లీలామాత్రంగా

అంతే !

ఆ తర్వాత

జీవిస్తూ మరణించడం మాని

మరణించాక కూడా జీవించాలనుకున్నాను

దివ్యత్వాన్ని నమ్ముతూ

సాగుతున్నాను

ప్రతి క్షణము నాకొక

మధుర అనుభవమే ! 

– డా. పులివర్తి కృష్ణమూర్తి

Pulivarthy Krishnamurthy,Telugu Kavithalu