2023-02-14 12:31:23.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/14/723175-prema.webp
అతడు :
——–
సిరిసిరిమువ్వా
నా గుండెలొ గువ్వా
ముత్యమంతమువ్వా
నా ముద్దులొలికె లవ్వా
చెడుగుడి ఆటతో
చెంతకుచేరవే
నిత్య వసంతంలా ననుమురిపించవే ,
ననుమురిపించవే. ॥సిరి॥
ఆమె :
——-
అందాలమామా
నా సుందర మోమా
కొంటె కొంటె చూపులాపి కొంగుముడివేయరా
ముసి ముసి నవ్వులతో
మురిపాలు పంచురా
నా చెంతనీవుంటే
స్వర్గమే మనదిరా ॥సిరి॥
అతను:
——-
పెదవంచు పలుకులతో
పెదవీ విరవకే
వద్దు వద్దంటూ
కవ్వించి నవ్వకే
నీ చూపు కైపులో
ఖైదీచేయకే
మువ్వల సవ్వడితో
నను బందించకే
రాలుగాయి చినదాన
రమ్యమైన సోకుదానా ॥సిరి॥
ఆమె :
——-
ప్రకృతమ్మ సాక్షిగా
పంచుకున్న బాసలతో
చేయి ,చేయి కలపరా
చెంతకు చేరరా
మధురాతి మధురమే
మన ప్రేమ పయనము
మాఘమాసమొచ్చిందీ మనువాడరారా
కన్నవారి దీవెనలతో
ఒకట వుదామురా ॥సిరి॥
-డా.బండారి సుజాత
(హన్మకొండ)
Madhura Prema,Bandari Sujatha,Telugu Kavithalu