2015-06-11 00:37:05.0
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల నుంచి మధ్యదరా సముద్రం గుండా ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వస్తున్న వారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తమ దేశంలో బతకు లేక, బతకలేక శరణార్థుల్లా ఐరాపా ఖండానికి చిన్న చిన్న పడవల్లో సామర్థ్యానికి మించి వస్తున్నారు. సముద్రంలో అలల తాకిడికి ఆ పడవలు తలకిందులవడంతో వందలాదిమంది చిన్నారులు, మహిళలు తీరం చేరకముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలు కూడా ఇలాంటివే. ఐరాపా ఖండానికి చిన్న పడవలో వస్తున్న […]
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల నుంచి మధ్యదరా సముద్రం గుండా ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వస్తున్న వారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తమ దేశంలో బతకు లేక, బతకలేక శరణార్థుల్లా ఐరాపా ఖండానికి చిన్న చిన్న పడవల్లో సామర్థ్యానికి మించి వస్తున్నారు. సముద్రంలో అలల తాకిడికి ఆ పడవలు తలకిందులవడంతో వందలాదిమంది చిన్నారులు, మహిళలు తీరం చేరకముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలు కూడా ఇలాంటివే. ఐరాపా ఖండానికి చిన్న పడవలో వస్తున్న శరణార్థల పడవ ఒకటి మునిగిపోవడంతో మిగిలిన వారు పడవ శకలాలపై కరుచుకుని ప్రాణాలు కాపాడేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి. పడవ మునకకు గురైన సమయంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలోని ప్రయాణికులు వీరిని చూసి ఇటలీ కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తం చేశారు. వారువచ్చి బతికి ఉన్నవారిని రక్షించగలిగారు.
Lives Sinking,Madhyadhara,People Migrating From Africa