http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/Afternoon-Sleeping.gif
2016-03-28 23:56:27.0
మధ్యాహ్నం పూట 40నిముషాలకంటే ఎక్కువ సేపు నిద్రపోతే మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఒక నూతన పరిశోధనలో వెల్లడైంది. మధ్యాహ్నాలు ఎక్కువగా నిద్రపోయేవారిలో అధికబరువు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి మెటబాలిక్ సిండ్రోమ్‌లు పెరుగుతాయని 3లక్షలమందిపై నిర్వహించిన ఒక భారీ అధ్యయనంలో తేలింది. 21 అధ్యయనాల ఫలితాల విశ్లేషణల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనం గురించి అమెరికన్ కాలేజి ఆఫ్ కార్డియాలజీ సాంవత్సరిక సదస్సులో వెల్లడించారు. మధ్యాహ్నాలు కాసేపు నిద్రపోతే మంచిదేకానీ, ఆ నిద్రా సమయం పెరుగుతున్న […]
మధ్యాహ్నం పూట 40నిముషాలకంటే ఎక్కువ సేపు నిద్రపోతే మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఒక నూతన పరిశోధనలో వెల్లడైంది. మధ్యాహ్నాలు ఎక్కువగా నిద్రపోయేవారిలో అధికబరువు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి మెటబాలిక్ సిండ్రోమ్‌లు పెరుగుతాయని 3లక్షలమందిపై నిర్వహించిన ఒక భారీ అధ్యయనంలో తేలింది. 21 అధ్యయనాల ఫలితాల విశ్లేషణల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనం గురించి అమెరికన్ కాలేజి ఆఫ్ కార్డియాలజీ సాంవత్సరిక సదస్సులో వెల్లడించారు.
మధ్యాహ్నాలు కాసేపు నిద్రపోతే మంచిదేకానీ, ఆ నిద్రా సమయం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయని ఇందులో నిపుణులు పేర్కొన్నారు. మధ్యాహ్నాలు ఎక్కువ సమయం నిద్రపోతే శరీరం గాడ నిద్రలోకి వెళుతుందని, దాంతో దాని మెటబాలిక్ సైకిల్ దెబ్బతింటుందని, శరీరంలో జీవరసాయన క్రియలు అస్థిరంగా మారతాయని వారు పేర్కొన్నారు. గాఢనిద్రలోకి వెళ్లకుండా చిన్నపాటి కనుకు తీయడం వలన అలాంటి హాని ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
Afternoon,Afternoon Sleeping,Sleeping
https://www.teluguglobal.com//2016/03/29/afternoon-sleeping/