2025-01-27 15:47:01.0
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను పరిశీలించి నివేదికను రూపొందించిన కమిషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పలు కీలక మార్పులు చేయాల్సి ఉన్నదని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల పలు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో వెగులు చూసిన ఫుడ్ పాయిజన్ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను విద్యా కమిషన్ సందర్శించింది. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఆహార నాణ్యత, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన.. తదితర అంశాలను కమిషన్ పరిశీలించి ఒక నివేదికను రూపొందించింది. సీఎస్ శాంతికుమారికి కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు నివేదిక అందించారు.
ఈ నివేదికలో ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూలో చేయాల్సిన మార్పులపై నివేదికలో పలు సూచనలు చేసింది. వారం వారం బిల్లులను చెల్లించాలి. ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలి. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలి. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్స్, ఇతర సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఇలా సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ విధానం వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవచ్చు అని నివేదికలో కమిషన్ పేర్కొన్నది.
Education Commission,Gave reportnTo Telangana government,On mid-day meal scheme