మధ్య తరగతికి మరో గుడ్‌ న్యూస్‌

2025-02-07 05:15:10.0

రెండేళ్ల తర్వాత రెపో రేట్‌ తగ్గించిన ఆర్‌బీఐ

ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండేళ్ల తర్వాత రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్ర శుక్రవారం ద్రవ్య పరపతి విధానం ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో హోం లోన్లతో పాటు పలు కీలక రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయని తెలిపారు. 2023 మే నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేట్‌ను స్థిరంగా ఉంచుతోంది. రెపో రేట్‌ ఐదేళ్ల తర్వాత 6.25 శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి రేటు 6.70 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని మల్హోత్ర ప్రకటించారు.

RBI,Repo Rate,Reduced 0.25 Percent,RBI Governor,Sanjoy Malhotra,GDP Growth 6.7 Percent,Monetary Policy