2023-02-02 04:36:28.0
ముజాహిదీన్‌లను మనమే తయారు చేశాం.. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తప్పు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ముజాహిదీన్‌లను మనమే తయారు చేశాం.. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్తాన్ హోంశాఖ మంత్రి రానా సనావుల్లా బుధవారం జరిగిన పార్లమెంటు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల వల్ల పాకిస్తాన్‌కు ఇప్పటివరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని వాపోయారు. ఉగ్రవాదుల దాడులతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన ప్రదర్శనలు జరిపారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 101 మంది మరణించారు. వారిలో 97 మంది పోలీసులే కావడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ సోమవారం పెషావర్ వెళ్లి పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
Pakistan,Home Minister,Rana Sanaullah,Interesting comments,Terrorists