మనకి ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎందుకు అవసరమో తెలుసా ?

https://www.teluguglobal.com/h-upload/2024/02/22/500x300_1300188-omega-3.webp
2024-02-23 03:50:27.0

ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇవి పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వాపును తగ్గించడానికి తోడ్పడుతాయి.

ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇవి పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వాపును తగ్గించడానికి తోడ్పడుతాయి. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి, గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి.. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది.

దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్‌ వంటి వ్యాధులు దరికి చేరవు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం గుండె, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచిది. లివ‌ర్‌లో కొవ్వు పెర‌గ‌కుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, నెల‌స‌రి స‌మ‌యంలో నొప్పుల‌ను నివారించ‌డంలోనూ, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలోనూ ఇలా ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డతాయి. మొత్తంగా ఆరోగ్యవంతమైన, చురుకైన జీవితం గడిపేందుకు ఈ ఫ్యాటీ ఆసిడ్లు ఎంతో అవసరం. ఇన్ని ఇలాంటి కీలకమైన పోషకాలు లోపించినపుడు శరీరంలో రకరకాల ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

వాతావరణం చల్లగా లేనపుడు కూడా చర్మం, జుట్టు పొడిబారిపోవడం, చర్మ ఆరోగ్యంలో ఆకస్మికంగా వచ్చే మార్పులు శరీరంలో ఒమెగా3 లోపాన్ని తెలియజేస్తుంది. కీళ్ల కదలికల్లో నొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం, అకారణంగా మనసు బావుండకపోయినా, డిప్రెషన్ కూడా అనిపించినా ఈ పోషకాహార లోపం జరుగుతోందని గుర్తించాలి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న పదార్ధాలు తీసుకోవడమే.

సాల్మన్ ఫిష్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతమైన మూలం. అలాగే వాల్‌నట్స్ , గుడ్లు, సోయాబీన్స్‌, అవిసె గింజలు, చియా సీడ్స్ లో కూడా ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. జనపనార గింజలు, సబ్జా విత్తనాల్లోనూ, బ్రస్సెల్స్ స్పౌట్స్‌, కాలే, పాలకూర లో కూడా ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా లభిస్తాయి.

Omega-3 Fatty Acids,Health Tips
Omega-3 fatty acids, Health Tips, Health, Telugu News, Telugu Global News, Latest Telugu News

https://www.teluguglobal.com//health-life-style/do-you-know-why-we-need-omega-3-fatty-acids-1003893