మనప్రేమ

2023-02-07 11:50:13.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/07/722359-mana-prema.webp

మన ప్రేమ మన ప్రేమ

సస్య సౌందర్య భూములలో

ప్రభవించి ప్రభవించి

నమ్ర మరుసీమ మగునో

కమ్ర సుమధామ మగునో

కల్లోలినీ తరంగములన్

పయనించి పయనించి

కీర్ణ సికతాద్రి యగునో

పూర్ణ కలశాబ్ది యగునో

కాలగాఢాగ్ని కీలలలో

తపియించి తపియించి

దగ్గ తరుకాండ మగునో

ముగ్ధ మధుభాండ మగునో

మన ప్రేమ మన ప్రేమ

సస్య సౌందర్య భూములలో

ప్రభవించి ప్రభవించి

నమ్ర మరుసీమ మగునో

కమ్ర సుమధామ మగునో

– రజని

Rajani,Mana Prema,Telugu Kavithalu