2023-08-19 18:17:56.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/19/812770-mana-bharat.webp
పుణ్యభూమి నా దేశం
నాదే భారత దేశం
సకల శాస్త్ర పారంగతుల
కాలవాలమీ దేశం
ఆదికవి నన్నయ్య
అవతరించిన నేల ఇదే
కవికాళిదాసుని కన్న
కర్మ భూమి ఇదే
పుణ్య మూర్తులెందరో అవతరించిన పవిత్రభూమి ఇదే
భగవద్గీతకు మాధవుడు
ప్రాణంపోసిన వేదభూమి ఇదే
శాంతి ,క్షమ ,సౌభ్రాతృత్వం వెలయించిన పుణ్యధాత్రి ఇదే
ఆర్యభట్ట భాస్కరులను కన్న మాతృభూమి ఇదే
అన్నమయ్య భక్తమయ కీర్తనల
రాగ భూమి ఇదే
శాస్త్రం పుట్టిందిక్కడ
శస్త్రం పట్టిందిక్కడ
కావ్యం పుట్టిందిక్కడ
కవనం పలికిందిక్కడ
రతనాల వంటి మేడలున్న
రత్నగర్భ నా భూమి
అరువది నాలుగు కళలకు
పీఠమైన పుణ్యభూమి
నాట్యశాస్త్ర రీతులకు వేదికైన
దివ్య భూమి
సామవేదశాస్త్రానికి నీరాజనమిచ్చిన పావన భూమి
బుద్ధుని బోధనల జగతిని
కాంతి నింపిన ధాత్రి ఇది
మానవ మనుగడకు ఘనమగు
కీర్తి ఛాత్రి పట్టిన మాత తాను
ప్రగతి మార్గ పయనంలో అగ్రగామి నా జనయిత్రి
ఈ భూమి నా భూమి
నాదే భారత భూమి ….
-శశిబాల ( హూస్టన్ )
Mana Bharata Bhumi,Shashi Bala,Telugu Kavithalu