2023-01-03 08:07:45.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/03/433700-mana-bhasha.webp
మమ్మీ దాడి సంస్కృతి మంచిది కాదనీ , మనము అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడాలని కొంత మంది జాతీయ వాదులు అంటూ ఉండటం మనం వింటూ ఉంటాము. ఇందులో జాతీయ భావం ఎక్కువగా ఉన్నట్టు ఉంది . పరాయి పాలనను గురించి చెప్పేటప్పుడు , ఇంగ్లీషు వాళ్ళు మాత్రము పరాయివాళ్ళు , మహమ్మదీయులు కాదు అన్నట్టు కథలు రాస్తూ వుంటారు.సినిమాలు కూడా తీస్తున్నారు .
ఇది ఒక రకం గా దోషయుక్తమైనదృష్టి , ప్రయత్నం చేసి ఇంగ్లీష్ కి ప్రత్యామ్నాయంగా గా హిందీ పదాలు సృష్టించి అవి ప్రచారం లోకి తెస్తున్నాము.
మరి మన తెలుగులో ఉన్న ఉర్దూ గుపదాలు ఏమిటి .. నిజానికి తెలుగు వలె అనిపిస్తూ ఈ మాటలు కూడా గూఢచారులల్లె తెలుగు లో తిరుగుతున్నాయి.
చాలా మందికి ఇవిఉర్దూ మాటలని తెలియదు.
తెలుగు లోకి వచ్చి తెలుగులా
స్థిరపడిపోయిన ఉర్దూ మాటలు
ఆఖరి: అసలు , : అసలు సంగతేమిటంటే లో లాగా (అసల్, నకెల్)అలాగేవీడికి వాడు నకలు, వీడిని చూసి వాడిని చూడక్కరలేదు
ఆఖరి నెత్తురు బొట్టువరకూ పోరాడతాను
(ఆఖిర్ అనే ఉర్దూ మాట )
త్రాసు : వాడు న్యాయం అన్యాయం త్రాసు లో త్రూచినట్లు చెబుతాడు
(తరాజ్ )
దర్జా :ఏం దర్జా వెలగబెడుతున్నాడు (దర్జీ కూడా దీనిలో నుండి వచ్చిందే
తాహత్: ఇది నా తాహతుకు
మించిన పని( ఇది తాఖత్ యొక్క అపభ్రంశ రూపం )
దబాయించటం : ఎంటోయ్ దబాయిస్తున్నావ్
చలాయించటం : ఎం అధికారం చేలాయిస్తున్నడురా వీడు
(పై రెండుమాటలు క్రమంగా దబా వ్నా, చలావ్నా,మాటలకు తెలుగు ఇంచు ప్రత్యయం చేరిన రూపాలు
ఖాయం : ఈ మాట పురోహితులు కూడా వాడు తుంటారు
ముహూర్తం ఖాయమైనా
(కాయం అనే ఉర్దూ మాట)
ఇక ఈ ఉర్దూ మాటలు వేద పండితులు కూడా వాడవారని
చె ప్పటానికి “స్మార్త కారకా వృత్తి ” అన్నపుస్తకంలో కీ. శ . చల్లా లక్ష్మీ నృసింహశాస్త్రి గారు వరాగమనం కి చేసిన ఈ అనువాదం చూడండి ‘ఉష్ణి కంచుక నవాంబర కజ్జల
స్రగ్నత్నాంగులీయ … అంటే వరుడు తలగుడ్డ చొక్కా నూతనంబరములు
• సుర్మా..(కాటుక)……
ఉర్దూ మాటలు తెలుగులో కి ఎంత వచ్చినయ్యో మనకు అర్థమవుతుంది
మెహర్బానీ : వీడేదో పెద్ద మెహర్బాని చేసినట్లు , (నేహర్బాన్)
జాబు :ఉత్తరం అన్న అర్ధంలో వాడతారు … దాని అసలు మాట
జవాబు .. ప్రత్యుత్తరం అని అర్ధం … రిప్లై
త:సీల్ దార్ , జమీందార్ , సిరస్తదార్, జవాబుదారి
శిస్తు : పన్ను
ఖబర్దార్ : ఇది మనం హెచ్చరిక అర్ధం లో వాడతాము. కాని అసలు అర్థం ఖబర్దార్ అంటే “ఖబర్ కలిగిన వాడు” గా చేయటం అని అర్ధం ..
అంటే… ఒకరకంగా ముందుగా సమాచారం చెప్పి
హెచ్చరించటం (‘హమ్ ఆప్కో కబర్దార్ కర్నే కో ఆయా హై . )
ఖతం :ఖతం చేయటం, చంపటమనే అర్థం కూడా ,
ఖాతర్ .; లెక్క చేయటం .. నా మాట కా స్తయినా ఖాతరు చేయడు
అమలు చేయటం : ఈ ఆర్డర్ అమలు లోకి వచ్చింది
(గవర్నమెంట్ రూలుంది కాని ఎవడు అమలుచేస్తున్నాడు)
ఫిర్యాదు ; ఫరియాద్ అనే ఉర్దూ పదం
బరాబర్ : అంటే సరిసమానమన్న అర్ధంలో,
కాని కావ్యాలలో వందిమాగధులు బరాబరులుపలకటం అనే
ప్రయోగం ఉంది అంటే ఇంద్రుడితో చంద్రుడితోసమానమన్నఅర్థమేమో !
రాయితీ : (హిందీ )పన్ను రద్దు చెయ్యటం , హిందీ ఉర్దూ రెండూను
బడాయి ; పోపోవోయ్ పెద్ద బడాయి … అలాగి లడాయి. అలాగే జులాయి ( మూలం తెలియదు)
గులాము : బానిస … ఇది ఉర్దూ అని తెలిసి కొంతమంది ,తెలియక
కొంతమందివాడుతుంటారు.
నాన్న అన్నది అన్య భాషా పదం ,నానా అనే శబ్దం నుండి
వచ్చిందేమో
చౌరస్తా : చతుష్పథం … కూడలి … గాంధీ చౌరస్తా
బజార్ ; సంత అని అర్థమేమో మనము దానిని రోడ్ , వీధి అనే అర్ధం లో కూడా వాడుతుంటాము ..
పట్నంబజార్ మొదలైనవి
మిఠాయి : మీఠా శబ్ద భవం ….తీపి వంటకం
హక్కు : స్వాతంత్రమే నా జన్మ హక్కు
(హక్)
బాబు :ఈ హిందీ మాట రాను రాను చిన్న పిల్ల వాడిని గురించి వర్ణన కిందికి వచ్చింది దీనికి Brown
గారిచ్చిన అర్థం “తెలుగు cognate with English -papa , Sanscrit -పిత Hebrew -abba , ఫాదర్ ,తండ్రి , అ venerable మాన్ పూజ్యుడు … బహుశా బాబు రాజేంద్ర ప్రసాదు లో బాబు కు అర్ధమిదేనేమో
హుకుం : ఆజ్ఞ
హుళక్కి : ఇది కన్నడం మాట
హుషారు ;బహుశా ఇది ఉర్దూ
హోషి యారు నుంచి వచ్చి ఉంటుంది .జాగరూకతతో ఉండమని అర్థం అనుకుంటాను
ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి
మనం తెలుగు అనుకుని వాడుతున్నప్పుడు తెలుస్తాయి
కచేరీ : ఆస్థానం .. బహుశా రాజు గారి ఆస్థానం లో జరిగేవేమో అందుకనే సంగీత కచేరీ అనే వాడుక
వచ్చి ఉంటుమది
హుజూర్…. ఇది ఉర్దూ మాట.
సముఖము లో .. ఉండటం
గురజాడ అప్పారావు గారు, గిరీశం చేత అనిపిస్తారు.. హమేషా బాదుషా వారి హుజూర్న ఉండటం
ఇవే కాదు . ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే విసుగు పుట్టి ఇన్ని వున్నయ్యా అనిపిస్తుంది
అందుకని ఇకనైనా ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు ,మహమ్మదీయులు మిత్రులు అనే అభిప్రాయం వదిలేస్తే
బాగుంటుంది.
మనని పాలించిన వారంతా మన మిత్రులే..
లేకపోతే మన భాషనుండి పరాయిభాషా పదాలన్నీ తీసేయాలి
-ఎ.సి.పి. శాస్త్రి
Telugu Kathalu,ACP Shastri