మమ్మల్నే తగలబెట్టే కోనసీమకు ప్రాజెక్టులు ఎలా వస్తాయి?- వైసీపీ ఎమ్మెల్యే

2022-06-27 21:55:39.0

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును జోడించడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల సమయంతో తమ ఇళ్లను తగలబెట్టడంపై మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌లు ఆవేదన చెందారు. వైసీపీ అమలాపురం ప్లీనరిలో నేతలిద్దరూ మాట్లాడారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం సరికాదనిపించిందని.. ఆ విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి తెలియజేశానని ఎమ్మెల్యే పొన్నాడ వివరించారు. కానీ సీఎం జగన్ ధైర్యం చెప్పారని.. ఆయనిచ్చిన ధైర్యంతోనే తిరిగి వచ్చానన్నారు. తనతోపాటు, […]

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును జోడించడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల సమయంతో తమ ఇళ్లను తగలబెట్టడంపై మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌లు ఆవేదన చెందారు. వైసీపీ అమలాపురం ప్లీనరిలో నేతలిద్దరూ మాట్లాడారు.

తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం సరికాదనిపించిందని.. ఆ విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి తెలియజేశానని ఎమ్మెల్యే పొన్నాడ వివరించారు. కానీ సీఎం జగన్ ధైర్యం చెప్పారని.. ఆయనిచ్చిన ధైర్యంతోనే తిరిగి వచ్చానన్నారు.

తనతోపాటు, మంత్రి విశ్వరూప్‌ను అంతం చేసేందుకు కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు కుట్ర చేయడం బాధాకరమన్నారు. అల్లర్ల వల్ల తమ కంటే కోనసీమ జిల్లా ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. కోనసీమ జిల్లాకు టూరిజం ప్రాజెక్టులు తీసుకురావాలని ప్రయత్నం చేశామని.. కానీ మంత్రిని, ఎమ్మెల్యేను తగలబెట్టే పరిస్థితులున్న చోటకు పరిశ్రమలు, ప్రాజెక్టులు ఎలా వస్తాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కోనసీమ ప్రాంతం అభివృద్థిలో పదేళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు.

మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. తన ఇంటిని కాల్చేయడంపై తనకూ చాలా బాధగా ఉందన్నారు. దాన్ని ధిగమింగుకుని పనిచేస్తున్నట్టు చెప్పారు. మన ఇల్లు తగలబెట్టడానికి కేవలం ఐదు నిమిషాల ముందే తన భార్య తప్పించుకుందని మంత్రి గుర్తుచేశారు.

 

Burning of their houses,expressed concern,Konaseema riots,Minister Vishwaroop,MLA Ponnada Satish Kumar