2024-12-25 06:36:48.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/25/1388875-dil-raju.webp
శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై అల్లు అరవింద్, సుకుమార్‌తో కలిసి బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్న దిల్‌రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మధ్యాహ్నాం 2 గంటలకు నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్‌లతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు. శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. మైత్రీ మూవీస్ నుంచి రూ. 50 లక్షలు, ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ.10 లక్షల చెక్కు ఇచ్చారని చెప్పారు. అల్లు అర్జున్ వాళ్ల తరఫున సహాయ సహకారాలు అందుతున్నాయి. మా బాలుడు కోలుకోవడానికి వాళ్ల సకారం కావాలని కోరారు. అలాగే అల్లు అర్జున్ అరెస్టు అతారనే సానుభూతితోనే కేసు వాపస్ తీసుకుంటానని చెప్పాను.దీనిపై నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు.
Sandhya Theatre tragedy,Dil Raju,Visits Sri Tej,At KIMS,Assures support,Allu Aravind,Director Sukumar