మలక్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం

https://www.teluguglobal.com/h-upload/2024/12/06/1383861-metro.webp

2024-12-06 11:56:40.0

మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. బైకులు తగలబడటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో మెట్రో స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనతో మలక్‌పేట – దిల్‌సుఖ్‌నగర్‌ మధ్య రాకపోకలకు కాసేపు అంతరాయమేర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మంట‌ల‌ను ఆర్పేసి, ట్రాఫిక్ జామ్‌ను క్లియ‌ర్ చేశారు. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Malakpet Metro Station,Fire Accident,Malakpet – Dilsukhnagar,Hyderabad,CM Revanth reddy,Telangana goverment