2025-02-19 11:22:18.0
వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని మాజీ సీఎం అన్నారు
తెలంగాణలో రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గులాబీ దళపతి అధ్యక్షతన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యకవర్గ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కమిటీలకు ఇన్చార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అధినేత సీరియస్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలో ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే 10 మంది బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నైరాశ్యంతో కాంగ్రెస్ పార్టీలో మారారని తెలిపారు. ఇలా ప్రచారం చేయడం సరైనది కాదని కేసీఆర్ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ కోసం కష్ట పడాలని గులబీ బాస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదన్నారు. తెలంగాణ ప్రజల బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే తెలుసు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి’’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టలని కేసీఆర్ పార్టీ శ్రేణులను సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని కేసీఆర్ తెలిపారు
BRS Party,KCR,KTR,Telangana Bhavan,TRS Party,Silver Jubilee Celebration,Former cm KCR,BRS membership,Latest Telugunews,Telugu News,CM Revanth reddy,Congress party,MLC Kavitha,Former minister harishrao