2023-04-03 11:41:12.0
https://www.teluguglobal.com/h-upload/2023/04/03/729432-mali.webp
1
ఎంత దూరమో
నీకు తెలీదు మాట్లాడే దాకా-
లోతు దిగుడు బావిలో కూడా
నీళ్ళు తోడుకుంటాను
కాసింత చేద దొరికితే-
ఇప్పటిదాకా వున్న మోడే
అందమైన తోడు అనుకుంటాను
చివరెక్కడో చిగురాకు నీడ చూసి-
2
మాటల్లేక
మనం ఎడారిదిబ్బలం.
చిర్నవ్వుల్లేక
మనం కురవని మబ్బులం.
3
వొక్క మాట కురిసిందా,
మనసంతా విరగ్గాసిన
పంట చేను-
~ అఫ్సర్ ( పెన్సిల్వీనియా )
Telugu Kavithalu