2025-02-03 11:46:47.0
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో సినీ ఇండస్ట్రీలో పలువురి ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు నార్సింగి పోలీసులు గుర్తించారు
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటున్న యూట్యూబర్ మస్తాన్ సాయికి చెందిన ఒక హార్డ్ డిస్క్‌ను పోలీసులకు లావణ్య అందించింది.తనతో పాటు సినీ ఇండస్ట్రీలో పలువురి ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసి బెదిరిస్తున్నాడని కొంత మంది సినీ హీరోల పోన్లను హ్యాక్ చేశాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నాది. రాజ్‌తరుణ్ తో విడిపోవడానికి మస్తానే కారణమన్నారు.
అందులో 200 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్లు తెలుస్తుంది. మస్తాన్ సాయి తనపై కూడా అత్యాచారం చేసినట్లు లావణ్య ఆరోపించింది… హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేశాడని తెలిపింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు వీడియోలు. హీరో నిఖిల్ ఫోన్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్కును సీజ్ చేశారు.
Mastan Sai,Lavanya,Tollywood,hero Raj Tarun,Hard disk,Varalakshmi Tiffin Center Owner Prabhakar Reddy,hero Nikhil,Narsinghi Police