2023-04-14 04:45:29.0
https://www.teluguglobal.com/h-upload/2023/04/14/730825-ambedkar-kavitha.webp
అవమానము లెన్నిటినో
అనుభవించె అంబేద్కర్
నీతి న్యాయ ధర్మాలను
అనుసరించె అంబేద్కర్
పెద్ద కుటుంబంలో పుట్టి
పేదతనంలో పెరిగెను
లెక్కలేని కష్టాలను
అనుభవించె అంబేద్కర్
చిన్నతనం నుండె చాల
తెలివితేట లున్నవాడు
కులంచిచ్చు మంటల్లో
అలమటించె అంబేద్కర్
ఏమాత్రం లెక్కలేక
ఎదురుతిరిగె సంఘానికి
బుర్రలోన విజ్ఞానం
పొందుపరచె అంబేద్కర్
నిమ్న జాతి ప్రజల కొరకు
వెన్నుదన్నుగా నిలచెను
ఉన్నతంగ తీర్చిదిద్ద
పరితపించె అంబేద్కర్
సమాజాన్ని ఉద్ధరింప
సంకల్పం పూనుకొనెను
పున్నమి వెలుగులు నింపా
అభిలషించె అంబేద్కర్
ఉన్నత విద్యను చదువగ
విదేశాల కేగినాడు
పట్టాలను చాలపొంది
పరిమళించె అంబేద్కర్
అనుకున్నది సాధించీ
అందలాల నెక్కినాడు
రాజ్యాంగం రచియించీ
పరవశించె అంబేద్కర్
భరతమాత కిరీటమున
రత్నమతడు సింహాద్రీ
బలహీనపు వర్గాలను
బాగుపరచె అంబేద్కర్
– సింహాద్రి వాణి
(విజయవాడ)
BR Ambedkar,Telugu Kavithalu,Simhadri Vani