2025-01-30 07:13:54.0
ఫిబ్రవరి 3న వసంత పంచమి పుణ్యదినాన అమృత స్నానం కోసం మరోసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం
https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398764-maha-khumbamela.webp
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు నేడు కూడా భక్తులు పోటెత్తారు. దట్టమైన పొగమంచు కమ్మేసినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాల కోసం త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. ఉదయం 8 గంటల వరకు 55 లక్షల మంది స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల రద్దీ నియంత్రణకు కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల అనుమతిని నిరాకరించారు.వీవీఐపీ పాస్‌లు రద్దు చేసింది. ఫిబ్రవరి 3న వసంత పంచమి పుణ్యదినాన అమృత స్నానం కోసం మరోసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇద్దరు రిటైర్డ్ సీనియర్ అధికారులను నియమించనున్నది. 2019 కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ డివిజినల్ కమిషనర్‌గా పనిచేసిన ఆశీష్ గోయెల్, ఆగ్రా డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ వైస్ ఛైర్మన్ భాను గోస్వామిలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మహాకుంభమేళా పరిపాలన నిర్వహణ కోసం అదనంగా ప్రత్యేక కార్యదర్శులను నియమించారు. ఫిబ్రవరి 12 వరకు వీరంతా ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
UP Government,Key Changes,After Maha Kumbh Stampede,VVIP Passes Cancelled,No Vehicles,Pilgrims,Mauni Amavasya,Ashish Goyal,Bhanu Goswami