https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398836-fire-accident.webp
2025-01-30 10:18:46.0
మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగింది
మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో టెంట్లు తగలబడుతున్నాయి. మంటలను అదుపు చేసేందు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం సిలిండర్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరుగడంతో స్థానికులు, భక్తులంతా అక్కడినుంచి భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే
Mahakumbha Mela,Fire Accident,Sector 22,Firefighters,Prayagraj,UP,CM Yogi,PM Modi