మహాకుంభమేళాలో అమిత్‌ షా

2025-01-27 09:07:43.0

పుణ్యస్నానమాచరించిన కేంద్ర హోం మంత్రి, యోగా గురు బాబా రామ్‌దేవ్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1397972-amit-sha.webp

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమనం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, యోగా గురు బాబా రామ్‌దేవ్‌ కూడా పుణ్యస్నానమాచరించారు.

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతున్నది. ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనున్నది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో 8-10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు (అమృత స్నానం) ఆచరించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించిందని అంచనా. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడికల్స్‌, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.

Amit Shah,Takes Sacred Dip,At Triveni Sangam,During Maha Kumbh 2025,Prayagraj