మహాకుంభమేళాలో తొక్కిసలాట.. సుప్రీంలో పిటిషన్‌

2025-01-30 05:57:55.0

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398737-suprem-court.webp

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమై, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఫిబ్రవరి 3న వసంత పంచ మి సందర్భంగా భక్తుల భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.

జనవరి 13న ప్రారంభమైన కుంభమేలా ఫిబ్రవరి 26 వరకు జరగనున్నది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా.45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జనవరి 29 వరకు 27 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

Maha Kumbh stampede,PIL,before Supreme Court,For safety measures,Action against UP officials