2025-02-01 12:01:41.0
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన దౌత్యవేత్తలు
https://www.teluguglobal.com/h-upload/2025/02/01/1399491-maha-kumbhamela.webp
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్ చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రష్యా, ఉక్రెయిన్ సహా అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనెడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా తదితర 77 దేశాల దౌత్యవేత్తలు మొదటిఇసారి ఇక్కడికి వచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుంభమేళాను సందర్శించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు.
లిథువేనియా రాయబారి డయానా మికెవిసీన్ మాట్లాడుతూ.. తనకు భారత్తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. అయితే కుంభమేళాకు వెళ్లే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదన్నారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. నేపాల్ రాయబారి మాట్లాడుతూ కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా హైకమిషనర్ అనిల్ సుక్లాల్ మాట్లాడుతూ మేము కుంభమేళాలో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. హిందువులే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ఇందులో పాల్గొనడం భారత సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తుందన్నారు.
118-Member Diplomatic Delegation,77 Countries,Arrives,At Maha Kumbh,Very excited