2025-02-15 05:34:16.0
త్రివేణి సంగమంలో నేడు కూడా పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు
https://www.teluguglobal.com/h-upload/2025/02/15/1403577-mahakumbhamela.webp
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఖ్య భారత్ చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఎక్కువే. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగమంలో నేడు కూడా పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు చేస్తున్నారని పేర్కొన్నది. దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 92.84 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం సంఖ్య 49.14 కోట్లు.
యూస్సెన్సస్ బ్యూరో ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 దేశాలలో భారతదేశం (1,41,93,16,933), చైనా (1,40,71,81,209), US (34,20,34,432), ఇండోనేషియా (28,35,87,097), పాకిస్థాన్ (25,7040), నైజీరియా (24,27,94,751), బ్రెజిల్ (22,13,59,387), బంగ్లాదేశ్ (17,01,83,916), రష్యా (14,01,34,279) మరియు మెక్సికో (13,17,41,347).భారత్, చైనా మినహా మహాకుంభాన్ని సందర్శించిన భక్తుల సంఖ్య ఈ దేశాలంటిన్ని అధిగమించింది. గత నెల 13న మొదలైన మహాకుంభమేళా ఈ నెల 26 వరకు జరగనున్నది. మరో 11 రోజులు మిగిలి ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని యోగి సర్కార్ భావిస్తున్నది.
50 crore and counting,Mahakumbh,Sees historic turnout,Faith and devotion,Holy dip at the Triveni Sangam