2024-09-30 10:39:39.0
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపిన అధికారులు
https://www.teluguglobal.com/h-upload/2024/09/30/1364600-earthquake.webp
మహారాష్ట్రలో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.2 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. మధ్యాహ్నం 1.37 గంటలకు భూకంపం సంభవించిందని అమరావతి రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ అనిత్ భత్కర్ తెలిపారు. చికల్ ధార, కట్ కుంభ్, చుర్ని, పంచ్‌డోగ్రీ తాలూఖాలు, మెల్ ఘాట్ ప్రాంతంలో స్పల్ప ప్రకంపనలు సంభవించాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. పరట్వాడ సిటీలోని కొన్ని ప్రాంతాలు, ధరణ, అకోట్ ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపణలు సంభవించాయని వెల్లడించారు.