మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ కీలక సూచనలు

2024-09-27 15:35:51.0

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ముంబైలో పర్యటించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సీఈసీ కీలక సూచనలు చేశారు.

https://www.teluguglobal.com/h-upload/2024/09/27/1363870-cec.webp

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ముంబైలో పర్యటించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సీఈసీ కీలక సూచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఈసీ ఆదేశించింది. బెంచ్‌లు, ఫ్యాన్లు, డ్రింకింగ్ వాటర్, షెల్టర్లు ఉండేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అసౌకర్యంపై ఓటర్ల నుంచి ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. అంతకుముందు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

Maharashtra Assembly Elections,Commissioner Rajeev Kumar,CEC,Mumbai,PM MODI