మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

2024-11-23 14:29:00.0

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380375-rahul-gandhi.webp

మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు. మహారాష్ట్ర ఓటమిపై విశ్లేషిస్తామని రాహుల్ తెలిపారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంతటి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించినందుకు గాను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూపరిరక్షణ విజయం అన్నారు. ఇండి కూటమి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.” అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో విజయం సాధించగా, ఇండియా కూటమి 45 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జార్ఖాండ్ లో మాత్రం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 56 స్థానాల్లో విజయం సాధించి జె ఎమ్ఎమ్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Maharashtra elections,Rahul Gandhi,Jharkhand assembly elections,Hemant Soren,Kalpana Soren,JMM,NDA alliance,Congress party,BJP,NCP