మహారాష్ట్ర డీజీపీపై ఈసీ వేటు

2024-11-05 12:06:26.0

కొత్త డీజీపీగా సంజయ్‌ కుమార్‌ వర్మ

https://www.teluguglobal.com/h-upload/2024/11/05/1375030-maharastra-dgp.webp

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు రెండు వారాల ముందు అధికార మహావికాస్‌ అఘాడీ కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. మహారాష్ట్ర డీజీపీ రష్మీ షుక్లాను పదవి నుంచి తప్పించింది. ఆమె స్థానంలో 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మను డీజీపీగా నియమించింది. సంజయ్‌ వర్మ ప్రస్తుతం లీగల్‌ అండ్‌ టెక్నికల్‌ డీజీగా పని చేస్తున్నారు. మహారాష్ట్ర ఫుల్‌ టైమ్‌ డీజీపీ నియామకానికి సంబంధించిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ల జాబితాలోనూ వర్మ మొదటి స్థానంలో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 20న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలకు ముందు అధికార కూటమికి డీజీపీ మార్పు పెద్ద దెబ్బేనని పరిశీలికులు చెప్తున్నారు.

Maharastra,Forth Coming Elections,DGP Change,Sanjay Kumar Varma New DGP,Rashmi Shukla,Shiv sena,NCP,BJP,Congress,Eknath Shinde,Udhav Thakre,Sharad Power