మహారాష్ట్ర ఫలితాలు.. ఈవీఎంలపై అనుమానాలు

2024-12-08 08:45:11.0

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్న శరద్‌ పవార్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/08/1384332-shard-pawar.webp

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. షోలాపూర్‌ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో యాంటి-ఈవీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు. అయినా ఓటు వేశారు. అమెరికా, ఇంగ్లండ్‌తో సహా ప్రపంచమంతా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నది. భారత్‌లో మాత్రమే ఈవీఎంలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై స్థానిక ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందజేయాలని వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తానని శరద్‌ పవార్‌ తెలిపారు.

మరోవైపు ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. ఎంవీఏ ఎమ్మెల్యేలు శనివారం ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారు ప్రమాణ స్వీకారం చేశారు. 

NCP (SP) chief Sharad Pawar,Raised doubts about EVMs,Maharashtra,Seeking repoll through ballots,Markadwadi village