2023-08-24 08:00:46.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/24/814809-mahashilpi.webp
ఇష్టపడి,
రేయింబవళ్ళు
కష్టపడి
ఓర్పుతో,
నేర్పుతో
మొద్దులాంటి నన్ను
తీర్చిదిద్ది
నాలోవెలుగులు నింపిన
మహాశిల్ఫీ !! నా
మహా ప్రాణదాతా !!!
నాడు, నీ
ఊపిరితో, చూపులతో
ఉలితో కొట్టిన దెబ్బలు
నా అణువణువునా
గాయపరిస్తే
చెప్పలేని బాధతో
అనరాని మాటలతో
నిన్ను మౌనంగా దూషించాను
నన్ను మన్నించు
మహాశిల్ఫీ !!
నా యీ సౌందర్యం, తేజస్సు
నువ్వుపెట్టిన భిక్ష !!
నేడు
నన్ను చూసిన అందరూ
మైమరచి
ఆనందసాగరంలో
తేలియాడుతూ
మహాద్భుతమైన
కళాఖండమని పొగుడుతున్నారు !
అవధుల్లేని నా ఆనందం
మాటలురాని, భాషచాలని
కృతజ్ఞతా భావం
నీకు యివే నా
శతకోటి ప్రణామాలు !
మహాశిల్ఫీ ! నా
మహాప్రాణదాతా !!!
— శాంతమూర్తి
(హైదరాబాద్)
Mahashilpi,Telugu Kavithalu,Shanthamurthy