మహా కుంభమేళాకు సర్వం సిద్ధం

రేపటి నుంచి 45 రోజుల పాటు కుంభమేళా.. 40 కోట్ల మంది వస్తారని అంచనా

మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ కేంద్రంగా 45 రోజుల పాటు మహా కుంభమేళా జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్యుల నుంచి దేశాధినేతలు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేసింది. కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకు ఇప్పటికే సాధువులు, అఘోరాలు ప్రయాగ్‌ రాజ్‌ కు చేరుకున్నారు. అక్కడి వీధుల్లో నాట్యం చేస్తూ భక్తులను అలరిస్తున్నారు. రుద్రాక్ష బాబా కుంభమేళాకే హైలైట్‌గా నిలుస్తున్నారు. 11 వేల రుద్రాక్షలతో ఆయన అలంకరించుకున్నారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల కోసం దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. భక్తుల కోసం అత్యవసర వైద్యం, ఇతర సదుపాయాలు సమకూర్చారు.

 

Maha Kumbh Mela,Prayag Raj,Uther Pradesh,13th January