https://www.teluguglobal.com/h-upload/2024/11/12/1376976-accident.webp
2024-11-12 04:16:08.0
పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద జరిగిన ఘటన.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దుర్ఘటన ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. మృతులను పెద్దపల్లిలోని ఉదయనగర్‌కు చెందిన అమృత, భాగ్యగా గుర్తించారు.
పెద్దపల్లి రంగంపల్లిక మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మహిళలు ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తుంటారు. అక్కడ పనిచేసిన తర్వాత రాత్రి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుందని ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆర్‌ఆర్ గార్డెన్ నుంచి బయలుదేరారు. ఈ సమయంలోనే కరీంనగర్ నుంచి వస్తున్న కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. నడుచుకుంటూ వెళ్లేవారు మొత్తం నలుగురు ఉండగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో పద్మజ అనే మహిళపరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువెళ్లారు. కాంత అనే ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె స్థానిక హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు. వీరిని ఢీకొట్టిన తర్వాత కారు ఆగకుండా వెళ్లింది. గాయపడిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి వచ్చారు. గాయపడిన వారిని, చనిపోయిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును సీసీ కెమెరాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తిని పట్టుకుంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
Accident,Rangampally,Peddapalli district,Two died,one condition critical