మహిళల U19 వరల్డ్‌ కప్‌ విజేతగా భారత్.. తెలుగు తేజం ఆల్‌రౌండ్‌ షో

2025-02-02 09:02:49.0

అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాపై టిమీండియా ఘన విజయం సాధించింది. తుదిపోరులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. 83 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో త్రిష 44 పరుగుల చేయగా, సానిక 26 పరుగలు చేసింది. మరో బ్యాటర్ కమలిని ఎనిమిది పరుగులే చేసి ఔటయ్యింది. ఇదిలా ఉండగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ మరోసారి కప్ సాధించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Under-19 T20 World Cup,India Bowling,South Africa,Gongadi Trisha,Kaula Reneke,BCCI,ICCI,Vaishtavi Sharma