https://www.teluguglobal.com/h-upload/2024/11/16/1378452-rk-roja.webp
2024-11-16 14:39:27.0
హోం మంత్రి అనిత్ స్టేట్ మెంట్ ను ట్వీట్ చేసిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా
వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు మహిళలను అక్రమంగా తరలిచారనే టీడీపీ, జనసేన ఆరోపణలు తప్పుడు ప్రచారమని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ఇచ్చిన అధికారిక ప్రకటనను తన ట్వీట్ కు జత చేశారు. వాలంటీర్లు మహిళలను అక్రమంగా తరలించారని, వైసీపీ పాలనలో ఏపీ నుంచి 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారన్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని కూటమి ప్రభుత్వమే తేల్చిచెప్పిందన్నారు. గడిచిన ఐదేళ్లలో 34 మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని హోం మంత్రి అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. మిస్సింగ్ కేసుల్లో 99.5 శాతం మంది మహిళలను గురించారని కేంద్ర హోం శాఖ పార్లమెంట్ లో గతంలోనే ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా అని ప్రశ్నించారు. ‘జస్ట్ ఆస్కింగ్?’ అంటూ తన ట్వీట్ ను ముగించారు.

Woman’s Trafficking,YCP,TDP,Janasena,Pawan Kalyan,RK Roja,AP Assembly,Home minister Anitha