మహిషాసురమర్దని అలంకారంలో దుర్మమ్మ

2024-10-11 04:30:13.0

ముగింపు దశకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368102-durga-mata.webp

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

శ్రీ మహిషాసురమర్దనీ దేవి

మహిష మస్తక నృత్తవినోదిని

స్ఫుటరణన్మణినూపుర మేఖలా

జనన రక్షణ మోక్షవిధాయిని

జయతి శుంభ నిశుంభ నిషూదిని।।

లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినిపై తల్లి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి అనుగ్రహం పొందితే అసాధ్యనేది ఉండదు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్వై స్వాహా అనే మంత్రాన్ని జపించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. సువాసినీ పూజ చేసి, మంగళద్రవ్యాలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు పెట్టాలి.