మాజీ ఎంపీ గోరంట్లకు పోలీసులు నోటీసులు.. ఇప్పుడు మాధవ్ వంతు

2025-02-27 14:05:53.0

అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు.

https://www.teluguglobal.com/h-upload/2025/02/27/1407255-madhav.webp

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మాధవ్‌పై విజయవాడలో కేసు నమోదైంది. మార్చి 5న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

ఏపీలో ఇటీవల ఏపీలో వైసీపీ నేతలు వరసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చారు. అయితే తాము నోటీసులు ఇవ్వడానికే వచ్చామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా పోసాని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.