2024-11-17 14:24:31.0
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణాపై కొందరు దాడికి యత్నించారు.
https://www.teluguglobal.com/h-upload/2024/11/17/1378651-navintha.webp
అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాపై దాడి జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో యువ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఖల్లార్ లో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు.
ప్రచారసభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు. వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారని దుయ్యబట్టారు. తనను దూషించారని, కొందరు తనపై ఉమ్మివేశారని తెలిపారు. తన గన్ మన్లు తనను కాపాడి అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై నవనీత్ ఖల్లార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.
former MP Navneet Rana,Maharashtra elections,Khallar,Amaravati,Shiv Sena party