2024-12-14 10:13:38.0
రోడ్డు విస్తరణ పనుల కోసం హైదరాబాద్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి మార్కింగ్ పెట్టారు.
రోడ్డు విస్తరణ పనుల కోసం హైదరాబాద్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి ట్రాఫిక్ అధికారులు మార్క్ పెట్టారు. దీంతో ” నా ఇంటికే మార్కింగ్ వేస్తారా.. స్థలం ఇచ్చేదేలేదని జానారెడ్డి అన్నారు.“నా ఇంటికే టెండర్ వేస్తారా..? ముఖ్యమంత్రి మాట్లాడతా.. ఎన్నో ప్రభుత్వాలను చూశా.. నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు” అంటూ తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై జానారెడ్డి మండిపడ్డారు ఆయనతోపాటు నటుడు, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారడంతో.. ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్‌గా భూసేకరణ మారింది.హైదరాబాద్ నగరంలో ఇప్పటికే హైడ్రా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాఫిక్ కి అడ్డంకిగా ఉన్న కొన్ని నిర్మాణాలను కూల్చివేయాలని ట్రాఫిక్ అధికారులు భావించారు.
former minister Jana Reddy,Hyderabad,Marking,CM Revanth reddy,KBR Park,Nandamuri Balakrishna,GHMC,Road widening works