మాజీ మంత్రి పద్మారావుగౌడ్‌ కు గుండెపోటు

2025-01-21 13:52:26.0

స్టంట్‌ వేసిన డాక్టర్లు.. డెహ్రాడూన్‌ పర్యనటలో ఉన్నప్పుడు స్ట్రోక్‌

మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ కు గుండెపోటు వచ్చింది. డెహ్రాడూన్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకు స్ట్రోక్‌ రావడంతో వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి స్టంట్‌ వేసి బ్లాక్‌ క్లియర్‌ చేశారు. ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పద్మారావు గౌడ్‌ క్షేమంగానే ఉన్నారని చెప్తూ ఆయన హాస్పిటల్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది, సన్నిహితులతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

Padma Rao Goud,Secunderabad MLA,Hart Attack,Dehradun,BRS