2024-12-28 13:43:39.0
పీజేఆర్ వర్ధంతి సందర్భగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు
బడుగు బలహీన వర్గాల గొంతుక మాజీ మంత్రి పీ జనార్థన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పీజేఆర్ వర్ధంతి సందర్భగా సీఎం నివాళులు అర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో పీజేఆర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతు పేదలకు నిత్యం ఆసరాగా నిలిచే వ్యక్తి మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి అని, నిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కరానికి పోరాడారని సీఎం తెలిపారు. అలాగే పీజేఆర్ 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించారని తెలిపారు. తెలంగాణ వాదానికి బలమైన గొంతుకగా నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth reddy,PJR,Tributes,Former CLP Leader,Hyderabad,khairatabad,CLP,Congress party