2023-06-25 12:02:29.0
https://www.teluguglobal.com/h-upload/2023/06/25/788272-mata-kana.webp
ఒక్కో సారి
మాట కన్నా మౌనమే
మేలనిపిస్తుంది
అందరూ ముసుగు మనుషులే
మనసు విప్పి మాట్లాడే వారే
లేరనిపిస్తుంది.
మనిషి ముందు ఓ మాట
మనిషి వెనుక ఓ మాట
నోరు మాట్లాడు తుంటే
నొసలు వెక్కిరించే మాట
నీ దగ్గర ఓ మాట
నా దగ్గర ఓ మాట
చిన్న కైతే ఓ మాట
పెద్ద కైతే ఓ మాట
బలవంతునికి ఓ మాట
బలహీనుడికి ఓ మాట
ధనవంతునికి ఓ మాట
దరిద్రునికి ఓ మాట
ఆడకైతే ఓ మాట
మగకైతే ఓ మాట
మాట ముందు ఓ మాట
మాట వెనుక ఓ మాట
మాట మార్చే మాట
మనిషి మనిషికీ మారే మాట
అందుకే ఒక్కోసారి
మాట కన్నా …
మౌనమే మేలనిపిస్తుంది
కోడూరి తిరుమల మాధవి
Koduri Tirumala Madhavi,Telugu Kavithalu,Mata Kanna