https://www.teluguglobal.com/h-upload/2022/12/24/500x300_432599-mental-health.webp
2022-12-25 07:31:17.0
Mental Health: గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బిజీగా ఉండే లైఫ్‌స్టైల్ వల్ల ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బిజీగా ఉండే లైఫ్‌స్టైల్ వల్ల ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్నాయి. అయితే తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మానసిక ఆరోగ్యా్న్ని కొంతవరకూ సరిచేసుకోవచ్చు. అదెలాగంటే..
మానసిక ఆరోగ్యం విషయంలో పోషకాహారం పాత్ర కూడా ఉంటుంది. షుగర్స్, వేపుళ్లు, మాంసం, పాల ఉత్పత్తులు లాంటివి నిద్రమత్తు, కుంగుబాటును పెంచుతాయి. అలాగే కూరగాయాలు, పండ్లు లాంటివి మూడ్‌ను పాజిటివ్‌గా మార్చగలవు. ఇలా ఆహారం, కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా మానసిక సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.
అన్నింటికంటే ముందుగా వేళకు ఆహారం తీసుకోవడం అనేది మనసు కుదురుగా ఉండటానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. వేళకు తినకపోతే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి, నీరసంగా అనిపిస్తుంది. ఫలితంగా ఆలోచనలపై ఎఫెక్ట్ పడుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలు అవసరం. కూరగాయలు, పండ్లు, గింజలు, పప్పులు.. ఇలా అన్ని రకాల పదార్థాలు తింటేనే పోషకాలన్నీ లభిస్తాయి. అత్యవసరమైన పోషకాలు లోపిస్తే ఐరన్ డెఫీషియెన్సీ, జింక్ లోపం, మెగ్నీషియం లోపం, విటమిన్ డి లోపం లాంటివి తలెత్తుతాయి. ఫలితంగా మూడ్ దెబ్బతింటుంది. అలాగే వైట్ బ్రెడ్, కేకులు, తెల్ల అన్నం, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటివి గ్లూకోజు లెవల్స్ ను వేగంగా మారుస్తాయి. దీనివల్ల తరచూగా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి.
మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే రోజంతా తగినంత శక్తి అందేలా చూసుకోవాలి. తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే ఏకాగ్రత దెబ్బతింటుంది.
ఇకవీటితో పాటు కెఫీన్ మితంగా తీసుకోవాలి. కాఫీ, టీల వల్ల వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపించినా మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా నిద్రలేమి వంటి సమస్యలు రావొచ్చు.
మెదడు సరిగా పనిచేయడానికి ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరం. వాటికోసం చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు, ఆలివ్ నూనె, గుమ్మడి విత్తనాలు వంటివి తీసుకోవాలి.
mental health,Food,mental health food diet
mental health, world mental health day, mental health foods depression, mental health food diet, what is a good diet for mental health, how food affect mental health
https://www.teluguglobal.com//health-life-style/foods-that-increase-mental-health-553638