మార్కెట్లో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

2022-06-18 01:11:08.0

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. రోజురోజుకీ పెట్రోల్ రేట్లు పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. పైగా సిటీలో తిరిగే వారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్రోల్ బైక్స్ తో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలాతక్కువ. ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏథర్ 450 ఎక్స్: ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 116 కి.మీ వరకు వెళ్లొచ్చు. […]

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. రోజురోజుకీ పెట్రోల్ రేట్లు పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. పైగా సిటీలో తిరిగే వారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్రోల్ బైక్స్ తో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలాతక్కువ. ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏథర్ 450 ఎక్స్: ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 116 కి.మీ వరకు వెళ్లొచ్చు. దీని ధర రూ. 1.38లక్షల వరకూ ఉంది. గ్రే, గ్రీన్‌, వైట్‌ కలర్స్‌లో లభిస్తుంది. దీని టాప్‌ స్పీడ్‌ 80kmph .

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 90కి.మీ వరకూ వెళ్లే ఈ స్కూటర్ ధర రూ. 81వేలుగా ఉంది. దీని టాప్‌ స్పీడ్‌ కేవలం 45kmph.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్: ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 140కి.మీ వరకు వెళ్లొచ్చు. దీని ధర రూ. 77.49వేలుగా ఉంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 45kmph

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ: టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీ స్కూటర్ సింగిల్ ఛార్జ్ కు 145కి.మీ వరకు వెళ్తుంది. ఈ బైక్‌ ధర రూ. 1.30లక్షలుగా ఉంది. దీని టాప్‌ స్పీడ్‌ 82kmph .

ఓలా ఎస్ 1 ప్రో: ఫుల్‌ ఛార్జ్ తో 135 కి.మీ వరకు ప్రయాణించగలిగే ఈ స్కూటర్ ధర రూ. 1.20లక్షకుపైనే. ఈ బైక్‌ టాప్ స్పీడ్‌ 115kmph

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ : ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 90కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గంటలో 25శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ బైక్‌ ధర రూ.1.42లక్షలకుపైనే. దీని టాప్ స్పీడ్ 78kmph

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1: ఈ స్కూటర్ తో సింగిల్ ఛార్జ్‌ కు 85కి.మీ వరకూ వెళ్లొచ్చు. ఈ బైక్‌ ధర రూ. 80వేలు. టాప్‌ స్పీడ్‌ 65kmph .

ప్యూర్ ఈవీ ఈఫ్లూటో 7జీ: ఈ స్కూటర్.. ఫుల్‌ ఛార్జ్ కు120కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ ధర రూ. 93వేలుగా ఉంది. దీని టాప్‌ స్పీడ్‌ 60kmph. ఛార్జ్ తో ప్రయాణించే ఈ స్కూటర్స్ మునుముందు మరిన్ని ఫీచర్స్ తో మన ముందుకు రావచ్చు.

 

ఎలక్ర్టిక్ స్కూటర్స్,ఛార్జింగ్‌ స్కూటర్స్,పెట్రోల్ బైక్స్,ఫుల్‌ ఛార్జ్‌,సింగిల్ ఛార్జ్‌,స్కూటర్