2024-12-06 12:28:43.0
జనవరి నుంచే రేట్లు పెంచేస్తున్న మారుతి సుజుకి
కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. అయితే క్యాలెండర్ మారకముందే కొనేయండి.. కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేయాలని ఇండియన్ లీడింగ్ కార్ సెల్లింగ్ కంపెనీ మారుతి సుజుకి చూస్తోంది. కొత్త ఏడాదిలో మారుతి కార్ల ధరలు నాలుగు శాతం పెంచనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే ఇండియా మార్కెట్‌లో ఆడి, హ్యుందయ్ మోటార్స్ కార్ల ధరలు పెంచేశాయి. ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చింది. ఖర్ల తయారీకి ఉపయోగించే విడిభాగాల ధరలు పెరగడంతో అందులో కొంత భారాన్ని కస్టమర్లపై మెపాల్సి వస్తుందని మారుతి సుజుకి పేర్కొన్నది. మారుతి సుజుకి బ్రాండ్‌లోని అన్ని మోడళ్ల కార్ల ధరలు జనవరిలో మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతాయని వెల్లడించింది.
Maruti Suzuki,Car Prices,3 to 40 Percent Hike,January