2025-01-01 03:22:02.0
ప్రముఖ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన యువ ఎంపీ
https://www.teluguglobal.com/h-upload/2025/01/01/1390622-tejaswi-surya.webp
దేశంలోనే అత్యంత చిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వీ సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. బెంగళూరు దక్షిన లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన ఆయన చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరత నాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే మంగళవారం ప్రకటించారు. మార్చి 24న ముహూర్తం నిర్ణయించినట్లు వెల్లడించారు. శివశ్రీ.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు.
BJP MP Tejasvi Surya,Getting,Married,Chennai-based singer,Bharatanatyam dancer,Shivasree Skanda Prasad