మా భర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నరు

https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1371104-tgsp-12-betalian-nalgonda.webp

2024-10-21 11:43:45.0

నల్గొండలో టీజీ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ భార్యల రాస్తారోకో

తమ భర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. నల్గొండలోని టీజీఎస్పీ 12వ బెటాలియన్‌ ఎదుట మెయిర్‌ రోడ్డుపై బైఠాయించి రాకారోకో చేశారు. తెలంగాణలో ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ నడుస్తోందని, పోలీస్‌ ఆఫీసర్లు తమ ఇండ్లల్లో కానిస్టేబుళ్లతో పని చేయించుకుంటున్నారని వారి భార్యలు ఆరోపించారు. నెలలో 26 రోజులు పని చేసి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇంటికి పోవాలని ఆర్డర్స్‌ ఇవ్వడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇంటికి దూరంగా 200 కి.మీ.ల దూరంలో డ్యూటీలు వేస్తున్నారని, బెటాలియన్స్‌ లో ప్లంబర్‌ సహా అన్ని పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. పని ఒత్తిడితో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మిగతా కానిస్టేబుళ్ల మాదిరిగానే స్పెషల్‌ కానిస్టేబుళ్లకు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ డ్యూటీ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

TGSP Constables,Duty Chart,26 Working Days,Family Members Protest,12th Battalion,Nalgonda