మిడిమిడి జ్ఞానంతో పార్టీని నడుపుతున్న రాహుల్‌

2024-12-18 11:31:51.0

రాహుల్‌ గాంధీ బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం భయపడదన్న కేంద్ర మంత్రి

కాంగ్రెస్‌ పార్టీ వరుసగా ఓడిపోతూ నిరాశలో కూరుకుపోయింది. ప్రధాని కావాలన్న రాహుల్‌గాంధీ కోరిక నెరవేరడం లేదని నేతలు నిరాశలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందన్నారు.రాహుల్‌గాంధీ మిడిమిడి జ్ఞానంతో పార్టీని నడుపుతున్నారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహన లేదన్నారు. రాహుల్‌ గాంధీ బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం భయపడదన్నారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ వైపు.. కేసీఆర్‌.. కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావొద్దని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు. 

Central Minister Kishan Reddy,Fire On Rahul Gandhi,Central government not afraid,Rahul Gandhi threats